దాదాపు పూర్తయిన సుమంత్ ఏమో గుర్రం ఎగరావచ్చు

దాదాపు పూర్తయిన సుమంత్ ఏమో గుర్రం ఎగరావచ్చు

Published on Sep 29, 2013 1:14 PM IST

emo-gurram-egaravachu

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా స్లోగా సినిమాలు చేస్తున్న హీరో సుమంత్. ఆయన తన దగ్గరికి వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా కొన్ని కొన్ని మాత్రమే ఒప్పుకుంటున్నారు. అలా ఓ కొత్త స్క్రిప్ట్ తో సుమంత్ ఓ సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం సుమంత్ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉండాలి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్ర ఆడియోని రిలీజ్ చేసి సినిమాని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం సుమంత్ మరొక సినిమాకి పచ్చ జెండా ఊపారు.

పింకీ సావిక హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి చంద్ర సిద్దార్థ్ డైరెక్టర్. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని చెర్రి ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించారు.

తాజా వార్తలు