నవంబర్ మూడవ వారంలో వర్ణ

నవంబర్ మూడవ వారంలో వర్ణ

Published on Sep 28, 2013 7:00 PM IST

anushka

అనుష్క నటించిన ‘వర్ణ’ సినిమా నవంబర్ 15న గానీ 22న గానీ విడుదలకానుంది. నిర్మాతలు ఇంకా ఈ తేదిని అధికారికంగా ప్రకటించాల్సివుంది. ముందుగా దీపావళికి ఈ సినిమాను విడుదల చేద్దాం అనుకున్నా కొన్ని కారణాల వలన వాయిదాపడింది

ఆర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చెయ్యనున్నారు. తమిళ వెర్షన్ ఆడియో ఇప్పటికే విడుదలైంది. తెలుగు వెర్షన్ యొక్క ఆడియో అక్టోబర్ రెండో వారంలో విడుదలచెయ్యనున్నారు. ఒక కొత్త రకం ప్రేమకధ తో రొమాంటిక్ ఫాంటసీ రూపంలో చూపించనున్నారు

ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకుడు. ప్రసాద్ వి పోట్లురి పి.వి.పి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హరీశ్ జయరాజ్ సంగీత దర్శకుడు. నేపధ్య సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నాడు

తాజా వార్తలు