ఈరోజు విడుదలకానున్న బిస్కెట్, డి ఫర్ దోపిడి సినిమాల పాటలు

ఈరోజు విడుదలకానున్న బిస్కెట్, డి ఫర్ దోపిడి సినిమాల పాటలు

Published on Sep 27, 2013 4:00 PM IST

bisket-and-d-for-dopidi

అరవింద్ కృష్ణ మరియు డింపిల్ చోప్డే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘బిస్కెట్’. చాలా రోజులక్రితమే ఈ సినిమా షూటింగ్ ను ముగించుకుని ఈరోజు అన్నపూర్ణ 7 ఏకర్స్ లో ఆడియో విడుదల వేడుక చేసుకోనుంది. ఆద్యంతం హాస్యభరితంగా సాగనున్న ఈ సినిమాను అనీల్ గోపిరెడ్డి మొదటిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంగీతం కూడా ఆయనే అందించడం విశేషం. ఈ చిత్రాన్ని గోదావరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్రవంతి మరియు రాజ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

అదేకాక ఈరోజు నొవోటెల్ లో సందీప్ కిషన్ మరియు వరుణ్ సందేశ్ కలిపి నటించిన ‘డి ఫర్ దోపిడి’ సినిమా ఆడియో కూడా విడుదలకానుంది. ఈ సినిమాకు క్రిష్ డి.కె మరియు రాజ్ నిదమోరు నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమాలో కొంత భాగాన్ని నాని సొంతంచేసుకున్నాడు. సిరాజ్ కల్లా ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయంకానున్నాడు. మహేష్ శంకర్ మరియు సచిన్-జిగార్ సంగీత దర్శకులు. ఈ సినిమా కూడా కామెడి ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది

తాజా వార్తలు