షూటింగ్ ముగించుకున్న రామయ్యా వస్తావయ్యా

షూటింగ్ ముగించుకున్న రామయ్యా వస్తావయ్యా

Published on Sep 26, 2013 10:50 PM IST

ramayya-vasthavayya
ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదలకానుంది. పండగ సీజన్ ను పురస్కరించుకుని ఈ సినిమా నిర్మాతలు భారీ విడుదలకు సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాకు థమన్ మంచి సంగీతాన్ని అందించాడు. ఈ నెల 23న ఆడియో విడుదలైన దగ్గరనుండీ ప్రతీచోటా అవే పాటలు వినిపిస్తున్నాయి. మంచి ట్యూన్ లకు, అంతకు మించిన సాహిత్యం జతకలిసి ఆడియోను విజయవంతం చేసాయి. ఈ సినిమా విజయంపై హరీష్ శంకర్ చాలా నమ్మకంగావున్నాడు.

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన సమంత, శృతిహాసన్ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ సినిమాకు త్వరలోనే సెన్సార్ జరగనుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు