మంచు విష్ణుతో పూరి జగన్నాథ్ సినిమా

మంచు విష్ణుతో పూరి జగన్నాథ్ సినిమా

Published on Sep 25, 2013 6:01 PM IST

vishnu-and-puri-jagannath
టాలీవుడ్లో ఇంటరెస్టింగ్ కాంబినేషన్ ని మనం చూడబోతున్నాం. యంగ్ హీరో మంచు విష్ణు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుందని సమాచారం. ఈ సినిమాని ఒక నవల స్టొరీ లైన్ ఆదారంగా తెరకెక్కించనున్నారని తెలిసింది. అలాగే ‘అసెంబ్లీ రౌడి’ సినిమాని రిమేక్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబందించిన పూర్తి సమాచారం త్వరలో అధికారికంగా తెలియజేసే అవకాశం వుంది.

విష్ణు ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘దూసుకేళ్తా ‘ సినిమా పోస్ట్ -ప్రొడక్షన్ పనుల్లో బిజీ0000గా వున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ నితిన్ తో కలిసి నిర్మిస్తున్న ‘హార్ట్ ఎటాక్’ సినిమా పనుల్లో వున్నాడు. పూరి జగన్నాథ్ తీస్తున్న ‘హార్ట్ ఎటాక్’ సినిమా ముగిసిన తరువాత విష్ణుతో కలిసి ఈ సినిమాని తీయవచ్చు. ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి విష్ణు చాలా సంతోషంగా వున్నాడు. ఈ సినిమాకు సంబందించిన పూర్తి సమాచారాన్ని త్వరలో మేము మీకు తెలియజేస్తాం ఫ్రెండ్స్ .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు