అత్తారింటికి దారేది ని లీక్ చేసిన దోషి దొరికాడు

అత్తారింటికి దారేది ని లీక్ చేసిన దోషి దొరికాడు

Published on Sep 25, 2013 12:05 AM IST

attarintiki-daredi

‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీకి పాల్పడ్డ దోషి దొరికాడు. ప్రొడక్షన్ బృందంకు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఆఫీసులో పని చేసే ప్రొడక్షన్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ ఈ దుర్మార్గనికి పాల్పడట్టు రుజువయింది.

అరుణ్ కుమార్ సినిమాకు సంబంధించిన సి.డి ని ఏ.పి.పి.ఎస్.సి కానిస్టేబల్ కు అందజేశాడు. అతను కృష్ణ జిల్లాకు చెందినా పెడన కు అందజేయడంతో అలా అలా పాకి పోయింది

ఈ దోషికి కఠినమిన శిక్షను అమలు చేయమని యావత్ సినిమా రంగం కోరుకుంటుంది. నిర్మాతలు ఇక ఇటువంటి చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ‘ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ అని అంటారు. అలాగే మనతో వుండి మనదగ్గరే పనిచేస్తూ తిన్నింటివాసాలు లెక్కపెట్టేవారికి వారి మూలాలు మర్చిపోయి జీవితాన్నే నాశనం చేసుకోగలరు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు