తనికెళ్ళ భరణి నటుడిగా చాలా మందికి తెలుసు కానీ అయన నటుడికన్నా మంచి రచయిత అన్నది కొంతమందికి తెలియని విషయం. ఆయన ఇటీవలే ‘మిధునం’ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ ని నిరూపించుకున్నారు. గత కొద్ది రోజులుగా అయన త్వరలోనే ఓ సినిమాని డైరెక్ట్ చెయ్యనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు నేటితో తెరపడింది. తనికెళ్ళ భరణి గారు త్వరలోనే శివుడికి పరమ భక్తుడైన భక్త కన్నప్ప పై ఓ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో తెరకెక్కించనున్నారు.
భరణి గారు ఈ సినిమాకి హీరోని కూడా ఎంచుకున్నారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఈ సినిమాలో భక్త కన్నప్ప పాత్ర చేయనున్నారు. ప్రస్తుతం తనికెళ్ళ భరణి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే సునీల్ కూడా తను చేస్తున్న సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. కావున ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.
1976 లో బాపు – ముళ్ళపూడి వెంకటరమణల కలయికలో కృష్ణంరాజు హీరోగా వచ్చిన భక్తకన్నప్ప సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు అదే కథాంశాన్ని తీయనున్న భరణి ఎంతవరకు కొత్త దానాన్ని చూపిస్తారు అన్నది చూడాలి.