టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న వెంకీస్ గ్రూప్

టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న వెంకీస్ గ్రూప్

Published on Sep 22, 2013 4:24 PM IST

venkys-group

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాల మార్కెట్ విలువ గణనీయంగా పెరుగుతోంది. దాంతో మల్టీ నేషనల్ కంపెనీస్ టాలీవుడ్ బడా ప్రొడక్షన్ సంస్థలతో కలిసి సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తున్నారు. రిలయన్స్, యు టివి, ఈరోస్ లాంటి సంస్థల తరహాలోనే ఇండియాలో బాగా పేరున్న వెంకీస్(ఇండియా) లిమిటెడ్ ఇప్పుడు టాలీవుడ్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది.

1971 లో స్థాపించిన విహెచ్ ప్రైవేట్ లిమిటెడ్ కి వెంకీస్ ఒక అనుబంధ సంస్థ. ప్రస్తుతం వెంకీస్ సంస్థ ఇండియాలోనే పౌల్ట్రీ వ్యాపారంలో టాప్ ప్లేస్ లో ఉంది. చాలా తక్కువ వయసులోనే ఈ సంస్థకి మానేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న బాలాజీ రావు అనతి కాలంలోనే కంపెనీని ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళాడు. అంతే కాకుండా 2010 నవంబర్ లో వెంకీస్ లండన్ లిమిటెడ్ అని స్థాపించి బ్లాకు బర్న్స్ రోవర్స్ ఫుట్ బాల్ క్లబ్ ని కొనుక్కున్నారు.

అలాంటి వెంకీస్ సంస్థ ఇప్పుడు తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టనుంది. ఈ సంస్థ ఇక్కడి బడా నిర్మాతల ప్రొడక్షన్ సంస్థలతో కలిసి టాప్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించనుంది. ఏయే ప్రొడక్షన్ సంస్థలతో కలిసి సినిమాలు నిర్మించనుంది అనే విషయాలను మీకు త్వరలోనే తెలియజేస్తాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు