పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చెయ్యనంటున్న వర్మ

పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చెయ్యనంటున్న వర్మ

Published on Sep 22, 2013 12:25 PM IST

Ram-Gopal-Varma2

సినిమాలు ఎంత బాగా తీసినా వివాదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మకి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అలాగే ఆయన ఏదైనా సరే ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ఇటీవలే వర్మ తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ కొన్ని ట్వీట్స్ చేసాడు. దాంతో అందరూ పవన్ తో సినిమా చెయ్యడానికే ఇలా చేస్తున్నాడని అనుకున్నారు.

ఈ విషయం పై ఓ ప్రముఖ పత్రిక వారు ఇదే విషయాన్ని అడిగితే ‘ భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ని నేను ఎప్పటికీ డైరెక్ట్ చెయ్యను. నా ఫిల్మ్ మేకింగ్ మెథడ్ పూర్తి డిఫరెంట్. అది పవన్ ఆన్ స్క్రీన్ ఇమేజ్ కి సూట్ అవ్వదని’ వర్మ సమాధానం ఇచ్చాడు.

ఆ ట్వీట్స్ ఊరించి అడిగితే ‘ నేను పవన్ కళ్యాణ్ లో గ్రేట్ లీడర్ ని చూసాను. నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే అదో కొత్త చరిత్ర సృష్టిస్తుంది. బాల్ థాక్రే లాగా పవన్ ప్రజల్ని అట్రాక్ట్ చెయ్యగలడని’ వర్మ జవాబిచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు