దూసుకెళ్తా సినిమాలో వెన్నెల కిషోర్ కడుపుబ్బా నవ్విస్తాడట

దూసుకెళ్తా సినిమాలో వెన్నెల కిషోర్ కడుపుబ్బా నవ్విస్తాడట

Published on Sep 21, 2013 11:24 PM IST

vennela-kishore

ఈ మధ్య వస్తున్న సినిమాలన్నిటిలో వెన్నెల కిషోర్ దాదాపుగా కనిపిస్తున్నాడు. రెండు సినిమాలలో హీరోగా నటిస్తూ తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకొనున్నాడు. ప్రస్తుతం ‘దూసుకెళ్తా’ సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొస్తున్నాడు.

ఇందులో తన పాత్ర ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుందట. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడట. అంతేకాక ‘బిందాస్’ సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చి ఈ సినిమాలో మరోసారి అవకాశం ఇచ్చిన వీరూ పోట్లకు ధన్యవాధాలు చెప్పాడు.

ఈ సినిమా విష్ణు సొంత బ్యానర్ లో నిర్మాణమవుతుంది. విష్ణు సరసన లావణ్య నటిస్తుంది. ప్రస్తుతం శోట్టింగ్ శరవేగంగా సాగుతుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు