ఎన్.టి.ఆర్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న ‘రామయ్యా వాస్తావయ్యా’ సినిమాలో శృతిహాసన్ ఒక మంచి పాత్ర పోషించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు అమ్ములు. ఆమెకు ప్రత్యేకంగా హరీష్ శంకర్ కృతజ్ఞతలు చెప్పాడు
ఇదిలా వుంటే మంచి స్పీడ్ లో సినిమాను పూర్తిచేశాడని సమంత హరీష్ ను పొగిడేసింది. ఈరోజు ఈ సినిమా ఆడియో విడుదలకానుంది. కాకపోతే ఈ వేడుకలో శృతి మరియు సమంత హాజరుకావడంలేదు. మోకాలి గాయంతో బాధపడుతున్న శృతి ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది
నిన్న విడుదలైన ప్రోమోలకు మంచి స్పందనను అందుకున్నాయి. క్యాచీ ట్యూన్ లు, మంచి సాహిత్యాన్ని అందించారు. ఈరోజు విడుదల కాబోతున్న ట్రైలర్ కూడా అద్బుతంగా వచ్చిందట