మిరపకాయ్ తో జతకట్టనున్న దేశముదురు భామ

మిరపకాయ్ తో జతకట్టనున్న దేశముదురు భామ

Published on Sep 20, 2013 5:10 PM IST

ravi-teja-and-hansika

తెలుగు మరియు తమిళ సినిమాలు కలుపుకుంటే ప్రస్తుతం హన్సిక చేతిలో పది సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సౌత్ లో ఆమె బిజీ తారగా వెలుగుతుంది. బరువు తగ్గించుకుని సన్నగా అందంగా తయారయ్యిన ఈ ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకలో తన వస్త్రధారణతో ఆకట్టుకుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ రవి తేజ సరసన నటించడానికి అంగీకరించింది. వీరిద్దరూ మొదటిసారి జత కట్టనున్నారు. ఈ సినిమాకు బాబి(కె.ఎస్ రవీంద్ర) దర్శకుడు. ఈయన ఇదివరకు ‘బలుపు’ సినిమాకు రచయితగా పనిచేసారు. ‘నిప్పు’ సినిమాను నిర్మించిన వైవి.ఎస్ చౌదరి ఈ సినిమాకు నిర్మాత

సంబంధిత సమాచారం

తాజా వార్తలు