జండాపై కపిరాజు నా కెరీర్ ను మార్చగలిగే సినిమా : నాని

జండాపై కపిరాజు నా కెరీర్ ను మార్చగలిగే సినిమా : నాని

Published on Sep 19, 2013 2:41 AM IST

nani

యువ హీరో నాని తన తదుపరి సినిమా ‘జెండాపై కపిరాజు’ పై చాలా ఉత్సాహంగా వున్నాడు. హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “నాకు ఈ సినిమా పై చాలా నమ్మకం వుంది. ఇది నా సినీ జీవితాన్నే మార్చగలిగే సినిమా” అని తెలిపాడు

ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రలలో కనిపిస్తాడు. అందులో ఒక పాత్రకోసం గుండు కూడా కొట్టించుకున్నాడు. ఈ సినిమా సామాజిక అంశాలను మేళవించిన ఒక క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతుందని, తనలోని మరో కోణం చూపిస్తుందని తెలిపాడు. అమలా పాల్ హీరోయిన్. సముద్రఖని దర్శకుడు. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు