ఆ కారణం నన్ను రైటర్ నుండి నటుడి వైపు నడిపించింది – ఎం. ఎస్ నారాయణ

ఆ కారణం నన్ను రైటర్ నుండి నటుడి వైపు నడిపించింది – ఎం. ఎస్ నారాయణ

Published on Sep 15, 2013 9:19 PM IST

MS-Narayana

టాలీవుడ్ లో ఇప్పుడున్న కామెడీ నటులలో మంచి కామెడీ నటుడు ఎం. ఎస్ నారాయణ. ఆయన ఇప్పటి వరకు దాదాపు వివిధ పాత్రలలో మొత్తం 700 సినిమాలలో నటించాడు. ఇప్పటి వరకు ఆయనకు 5 నంది ఆవార్డులు రావడం జరిగింది. మొదట ఈయన ఒక లెక్చరర్ గా పనిచేశారు. అ తరువాత కొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేయడం, తరువాత సినిమాల్లో నటించడం జరిగింది. ఈ మద్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ ఒక సినిమా విజయాన్ని సాదించాలంటే ముఖ్యంగా ఆ సినిమా కథపై ఆదారపడి ఉంటుంది. కానీ ఆ క్రెడిట్ మాత్రం రైటర్ కు రావడం లేదు. ముఖ్యంగా సినిమాలో ఎవరైనా గుర్తించేది నటుడుని, డైరెక్టర్ ని మాత్రమే. ఈ విషయమే నన్ను రైటర్ నుండి ముందుకు నడిపించింది. రైటర్ ఫోటోని కూడా పోస్టర్ పై పబ్లిష్ చేయాలన్నది నా ఆశ.. ఏది ఏమైనా నేను ఇప్పటికి సగం ఆశయాన్ని మాత్రమే సాదించాను అలాగే మనం కోసం విది ఏదో డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంది’ అని అన్నాడు. అలాగే అందరూ అనుకున్నట్టుగా నేను తాగుబోతును కాదు. నేను మద్యాన్ని లిమిటెడ్ గా నే తీసుకుంటాను అని అన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు