విడుదల తేదీ : నవంబర్ 28, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ధనుష్, కృతి సనన్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకుడు : ఆనంద్ ఎల్ రాయ్
నిర్మాతలు : ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషన్ కుమార్, క్రిషన్ కుమార్
సంగీత దర్శకుడు : ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రాఫర్ : తుషార్ కాంతి రే
ఎడిటర్ : హేమల్ కొఠారి, ప్రకాష్ చంద్ర సాహో
సంబంధిత లింక్స్ : ట్రైలర్
సౌత్ స్టార్ ధనుష్ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో మరోసారి చేతులు కలిపి నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘తేరే ఇష్క్ మే’. కృతి సనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నేడు వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ :
శంకర్ గురుక్కల్(ధనుష్) ముక్కు మీద కొపం ఉండే కాలేజీ స్టూడెంట్. అదే కాలేజీలో పీహెచ్‌డి పూర్తి చేయాలని వస్తుంది ముక్తి భేనివాల్(కృతి సనన్). కొన్ని ప్రయోగాల ద్వారా కోపదారి మనిషిని సాధారణ మనిషిగా మార్చే థీసిస్‌పై ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. దీంతో శంకర్‌ను మామూలు మనిషిగా మార్చేందుకు ఆమె ఈ థీసిస్‌ను అప్లై చేస్తుంది. కానీ ఇది కొన్ని సమస్యలను తీసుకువస్తుంది. దీంతో వారి జీవితాలు ఎలా మారిపోయాయి..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
‘తేరే మేరే ఇష్క్’ చిత్రానికి మేజర్ అసెట్ ఈ సినిమాలో నటించిన ధనుష్, కృతి సనన్ అని చెప్పాలి. ఆవేశం, కోపంతో ఊగిపోయే కుర్రాడి పాత్రలో ధనుష్ అద్భుతమైన నటన చూపెట్టాడు. సినిమా మొదలయ్యాక వచ్చే సీన్స్ ధనుష్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ఆకట్టుకుంటాయి.
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఫన్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. తరుచుగా వచ్చే హ్యూమర్, లవ్ సీన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. కృతి సనన్ తన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఆమె తన పాత్రలో ఒదిగిపోయిన తీరు బాగుంది. ఆమె ఎమోషన్స్‌ను పండించిన తీరు ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది.
ఇంటర్వెల్లో వచ్చే తమిళ్ ట్రాక్ బాగుంది. ధనుష్, తన తండ్రి ప్రకాష్ రాజ్ మధ్య బాండింగ్ ఈ ట్రాక్‌లో మెప్పిస్తుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్ :
సినిమా ఆరంభం బాగున్నా, దానిని సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సీన్స్ ప్రేక్షకులను మెప్పించవు. సినిమా కథ ఎటు వెళ్తుందో సగటు ప్రేక్షకుడికి అర్థం కాకుండా పోతుంది. సెకండాఫ్‌ను చాలా కన్ఫ్యూజింగ్గా ప్రెజెంట్ చేశారు.
దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఇంటెన్సిటీ లెవెల్స్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లారంటే, ఆయన గత చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమాలో లీడ్ పెయిర్ ప్రవర్తించిన తీరు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోదు. ఇక సినిమా ముందుకు వెళ్తున్న కొద్ది ప్రేక్షకుల్లో ఆసక్తిని మెయింటెయిన్ చేయలేకపోయారు. సినిమా క్లైమాక్స్ కొంతవరకు పర్వాలేదనిపించినా, ఫస్ట్ హాఫ్ ఇంపాక్ట్‌తో అది కూడా ఆడియన్స్‌కు నచ్చకుండా మిగులుతుంది.
సాంకేతిక విభాగం :
ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, బీజీఎం బాగున్నాయి. అయితే, టైటిల్ ట్రాక్ సాంగ్‌ను సినిమాలో పూర్తిగా చూపెట్టకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు లోనవుతారు. తుషార్ కాంతి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, దానిని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూ్ట్ చేయలేదనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంపై ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘తేరే ఇష్క్ మే’ చిత్రం రొటీన్ రొమాంటిక్ డ్రామాలకు కాస్త వైవిధ్యంగా అనిపించినా, పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో వెనుకబడింది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ధనుష్, కృతి సనన్ తమ పర్ఫార్మెన్స్లతో మెప్పిస్తారు. అయితే, సెకండాఫ్ మాత్రం సినిమాకు మేజర్ డ్యామేజ్ చేసింది. కథ చాలా కన్ఫ్యూజింగ్గా సాగుతుంది. దీంతో ప్రేక్షకులను ఈ సినిమా కొంతవరకు మాత్రమే మెప్పిస్తుంది. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూడటం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


