యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన ఓ ఎమోషనల్ ఫ్యాన్ బయోపిక్ చిత్రమే “ఆంధ్ర కింగ్ తాలూకా”. డీసెంట్ గా బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అంతే డీసెంట్ టాక్ ని కూడా అందుకుంది. ఇలా ఫైనల్ గా ఈ సినిమా రామ్ కి చాలా కాలం తర్వాత హిట్ టాక్ ని అందించింది.
ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ అందుకుంది అని చెప్పాలి. అక్కడ ఈ సినిమా 2 లక్షల 50 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు రాబట్టి దూసుకెళ్తుంది. సో వీకెండ్ కి మరింత బెటర్ నెంబర్ ఈ సినిమాకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో రావు రమేష్ అలాగే మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించగా వివేక్ మెర్విన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.


