చరణ్ కోసం సుకుమార్ రూటు మారుస్తాడా..?

చరణ్ కోసం సుకుమార్ రూటు మారుస్తాడా..?

Published on Nov 26, 2025 11:00 PM IST

rc17

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది.

RC17 ప్రాజెక్ట్‌కి సంబంధించి సినీ సర్కిల్స్‌లో ఓ కొత్త బజ్ వినిపిస్తోంది. గతంలో చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగింది. అయితే, ఈసారి వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా పూర్తిగా స్టైలిష్‌గా సాగే కథ నేపథ్యంలో రానుందని టాక్ వినిపిస్తోంది. దీనిలో చరణ్ లుక్స్, గెటప్ మోడ్రన్‌గా ఉంటాయని తెలుస్తోంది.

దీంతో రామ్-సుకుమార్ కాంబో ఈసారి ఎలాంటి కథతో వస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఆతృతగా చూస్తు్న్నారు.

తాజా వార్తలు