ఘట్టమనేని కొత్త హీరో కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

ఘట్టమనేని కొత్త హీరో కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

Published on Nov 20, 2025 12:10 PM IST

ghattamaneni jayakrishna

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ సినిమాకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మరి వీరి ఘట్టమనేని కుటుంబం నుంచి రీసెంట్ గానే ఓ ఇద్దరు యువ స్టార్స్ కూడా తెలుగు సినిమాకి పరిచయం అయ్యేందుకు రెడీ అయ్యారు. మరి వారిలో యంగ్ హీరో ఘట్టమనేని జయకృష్ణ కూడా ఒకడు.

జై హీరోగా టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని చేయనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే అనౌన్స్ చేసిన ఈ సినిమాకి స్టార్ సంగీత దర్శకుడు ఇప్పుడు లాక్ అయినట్టు అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. మరి ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు జీ వి ప్రకాష్ అట.

తెలుగు, తమిళ్ లో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న ఈ టాలెంటెడ్ సంగీత దర్శకుడు ఇటీవల, గుడ్ బ్యాడ్ అగ్లీ, లక్కీ భాస్కర్ ఇంకా ఎన్నెన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. మరి తాను ఈ క్రేజీ కాంబినేషన్ కి వర్క్ చేయనుండడంతో ఈ ప్రాజెక్ట్ కి మరింత బలం చేకూరినట్టు అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి రాషా తాడని హీరోయిన్ గా నటిస్తుండగా జెమినీ కిరణ్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో ఈ సినిమా రానుంది.

తాజా వార్తలు