ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన గ్లి్ంప్స్‌ను గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో అఫీషియల్‌గా ప్లే చేశారు. ఈ గ్లింప్స్ వీడియో రాజమౌళి మార్క్ డిటెయిలింగ్‌తో కట్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ వీడియోలో ఈ సినిమా కథ గురించి చిన్న హింట్ ఇచ్చారు.
కాలాలను కలుపుతూ జరిగే ఈ చిత్ర కథలో మహేష్ బాబు సేవియర్‌గా ఎలాంటి సాహసాలు చేస్తాడా అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక గ్లింప్స్ చివర్లో నంది వాహనంపై ఉగ్రరూపంలో మహేష్ కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాను జక్కన్న మహాకావ్యంలా మలచబోతున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను వివిధ దేశాలతో పాటు వివిధ కాలాలతో లింక్ పెట్టి జక్కన్న చేయబోతున్న మ్యాజిక్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక రుద్ర అనే పాత్రలో తాండవం చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా.. ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నారు.


