టీజర్‌ను పట్టుకొస్తున్న ‘మోగ్లీ’.. ఎప్పుడంటే..?

టీజర్‌ను పట్టుకొస్తున్న ‘మోగ్లీ’.. ఎప్పుడంటే..?

Published on Nov 8, 2025 7:09 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న ‘మోగ్లీ’ కూడా ఒకటి. ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్రంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఇందులోని రొమాంటిక్ ట్రీట్మెంట్ కూడా ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. మోగ్లీ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు.. నవంబర్ 12న ఈ టీజర్ రానుందని వారు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో రోషన్ కనకాల హీరోగా తనదైన పెర్ఫార్మెన్స్‌తో దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. సాక్షి మదోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు