సంగీత కళాకారులకు ఇళయరాజా ఆహ్వానం !

సంగీత కళాకారులకు ఇళయరాజా ఆహ్వానం !

Published on Nov 3, 2025 1:03 PM IST

Ilayaraja

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తన కుమార్తె భవతారణి పేరిట బాలికల ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన గతంలో వెల్లడించారు. ఇందులో 15ఏళ్లలోపు చిన్నారులు ఉంటారని కూడా ఇళయరాజా చెప్పుకొచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం భవత గర్ల్స్‌ ఆర్కెస్ట్రాను ఇళయరాజా ప్రారంభించారు. ఆసక్తి కలిగిన గాయినులు, సంగీత కళాకారులకు ఈ బృందంలో చోటు కల్పించనున్నట్లు ఇళయరాజా తెలిపారు.

ఈ సందర్భంగా ఇళయరాజా క్లారిటీ ఇస్తూ.. ‘ఆసక్తి, ప్రతిభ కలిగినవారు స్వీయ వివరాలు, ఫోన్‌ నెంబరు తదితర వివరాలను [email protected] అనే ఈ-మెయిల్‌ చిరునామాకు పంపాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించి ఆయన సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టరునూ విడుదల చేశారు. ఇళయరాజా కుమార్తె భవతారణి గత ఏడాది జనవరి 24న క్యాన్సరుతో మరణించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు