‘ఉప్పెన’ తర్వాత ఆ ఫీట్ ‘డ్యూడ్’ తోనే!

‘ఉప్పెన’ తర్వాత ఆ ఫీట్ ‘డ్యూడ్’ తోనే!

Published on Oct 28, 2025 10:02 AM IST

dude

రీసెంట్ గా దీపావళి కానుకగా వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన ఎంటర్టైనర్ చిత్రం డ్యూడ్ కూడా ఒకటి. మరి ఈ సినిమాని మన తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించగా తమ బ్లాక్ బస్టర్ హిట్ ఉప్పెన తర్వాత ఆ తరహా ఫీట్ ని మళ్లీ తాము డ్యూడ్ తో అందుకున్నట్టు చెబుతున్నారు.

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాకి అదే తొలి చిత్రం దానితోనే 100కోట్ల గ్రాస్ ని సాధించారు. ఇక డ్యూడ్ తో కూడా కీర్తిశ్వరన్ కి మొదటి సినిమానే. ఇది కూడా 100కోట్లకు పైగా రాబట్టింది. ఇలా ఇద్దరు డెబ్యూ దర్శకులతో 100 కోట్ల సినిమాలు అందించిన నిర్మాణ సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ ఈ మధ్య కాలంలో నిలిచింది అని చెప్పవచ్చు. ఇక ఇదే ఫ్లో ముందు ముందు సాగుతుంది ఏమో చూడాలి.

తాజా వార్తలు