“ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!

“ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!

Published on Oct 28, 2025 8:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే ఓజి. తమిళ్ నుంచి వచ్చిన పలు గ్యాంగ్ స్టర్ సినిమాలకి ధీటైన సమాధానం అన్ని కోణాల్లో అందించిన ఈ సినిమా ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో వచ్చి సంచలన రెస్పాన్స్ ని అందుకుంటుంది. అయితే ఈ సినిమాలో సంగీత దర్శకుడు థమన్ వర్క్ కి డే 1 నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. తను మీసం తిప్పి చెప్తున్నా అంటూ ఇచ్చిన ఎలివేషన్ కూడా మళ్లీ వైరల్ అయ్యింది.

ఇక అంతకు మించిన స్టాండర్డ్స్ లోనే సినిమాలో సంగీతం ఉండేసరికి ఓటీటీలో వచ్చాక సినిమా ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) కోసం చర్చలు మొదలయ్యాయి. మరి దీనిపై ఫైనల్ గా థమన్ ఓపెన్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నామని అతి త్వరలోనే ఓజి ఓఎస్టీ విడుదల చేస్తామని హామీ ఇచ్చాడు. దీనితో అభిమానులు దీని కోసం మరింత ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు