విడుదల తేదీ : అక్టోబర్ 24, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
ప్రసార వేదిక: నెట్ ఫ్లిక్స్
నటీనటులు: యానిమేటెడ్ పాత్రలు
దర్శకత్వం: ఉజాన్ గంగూలీ
నిర్మాతలు: అలోక్ జైన్, అను సిక్కా, అజిత్ అంధరే
సంగీతం: సిమాబ్ సేన్
యానిమేషన్ స్టూడియో: హై-టెక్ యానిమేషన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఇటీవల దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యిన యానిమేటెడ్ సిరీస్ నే కురుక్షేత్ర. హిందీలో తెరకెక్కించిన ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది. అయితే మొదటి సీజన్ గా 9 ఎపిసోడ్స్ వస్తే నెక్స్ట్ 9 ఎపిసోడ్స్ ఇప్పుడు స్ట్రీమింగ్ కి వచ్చాయి. ఇక ఈ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి అనేది సమీక్షలో చూద్దాం రండి.
కథ:
గత 9 ఎపిసోడ్స్ తర్వాత కొనసాగింపుగా కౌరవ పక్షానికి ద్రోణాచార్యుని తర్వాత వారికి సైన్యాధ్యక్షుడు ఎవరు అనేది ప్రశ్నగా మారుతుంది. ఇంకోపక్క పాండవులు, కౌరవ పక్షాన ఉన్న యోధులు దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ ఇతరులతో చేసిన భీకర పోరాటం ఎలా సాగింది? అసలు ఈ కురుక్షేత్రంకి ఆది ఏంటి అంతం ఎవరు? ఈ క్రమంలో భీముడుకి కనిపించిన ప్రాముఖ్యత ఏంటి? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం, కర్మ ఫలితాలు, 18 రోజుల కురుక్షేత్ర మహా సంగ్రామం తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలి అంటే ఈ మిగతా ఎపిసోడ్స్ చూడాలి.
ప్లస్ పాయింట్స్:
మొదటి సీజన్ లో వచ్చిన 9 ఎపిసోడ్స్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ తదుపరి సీజన్ డీసెంట్ గా ఉందని చెప్పవచ్చు. ఇందులో కుంతి, కర్ణ అలాగే దుశ్శాసన, భీమ ఇంకా అశ్వత్థామ ఎపిసోడ్స్ బాగున్నాయని చెప్పాలి. మంచి యుద్ధ సన్నివేశాలు, ఎమోషన్స్ వీటిలో కనిపిస్తాయి.
అంతేకాకుండా గత సీజన్ లో యుద్దనికి ముందు చూపించిన పరిస్థితిలు యుద్ధం సమయంలో పరిస్థితులు ఆకట్టుకుంటే ఇందులో వాటితో పాటుగా యుద్ధం తర్వాత చూపించిన పరిస్థితులు వాటిపై సాగే స్త్రీ పర్వ ఎపిసోడ్ ఒకింత డ్రామా మంచి డైలాగ్స్ లాంటి వాటిని కోరుకునే వారికి కనెక్ట్ అవుతుంది.
ఇక శ్రీకృష్ణ పాత్రపై పలు సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ లాంటివి తన అభిమానులకు మరోసారి ట్రీట్ అందిస్తాయి అని చెప్పొచ్చు.
మైనస్ పాయింట్స్:
ఈ మిగతా 9 ఎపిసోడ్స్ తాలూకా సీజన్ లో కొన్ని ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ కథనం మాత్రం స్లోగా వెళుతున్నట్టు అనిపించక మానదు. అయితే అది ఆవశ్యకం అయినప్పటికీ గత సీజన్ ని చూసిన జెనరల్ ఆడియెన్స్ కి రుచించకపోవచ్చు.
ఇక దీనితో పాటుగా అర్జునుడు వర్సెస్ కర్ణ ఎపిసోడ్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. ఇది ఈ మధ్య సినిమాలతో కూడా బాగా వైరల్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని ఇంకా బెటర్ గా ప్లాన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అంతే కాకుండా మహాభారతం కోసం మంచి ఐడియా ఉన్నవారికి అలాగే ఇది వరకు ఇతర వెర్షన్స్ విన్నవారికి ఇది కొంచెం భిన్నంగా అనిపించే అవకాశం కూడా ఉంది. సో వారు ఈ సీజన్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోవచ్చు.
సాంకేతిక వర్గం:
ఓవరాల్ సిరీస్ లో నిర్మాణ విలువలు అయితే బాగానే ఉన్నాయి. మంచి సంగీతం, యాక్షన్ పార్ట్ అలానే పాత్రలు డిజైన్ వంటివి బాగున్నాయి. అయితే యానిమేషన్ పరంగా చాలా వరకు మంచి వర్క్ అందించే ప్రయత్నం అయితే చేసినట్టు కనిపిస్తుంది.
ఇక దర్శకుడు ఉజాన్ గంగూలీ మొదటి 9 ఎపిసోడ్స్ లోనే దాదాపు 14 రోజుల యుద్ధాన్ని చూపించేశారు.కానీ మిగతా 4 రోజుల యుద్ధాన్ని ఎలా మిగతా 9 ఎపిసోడ్స్ కి తీర్చిదిద్దారు అనే దానికి డీసెంట్ ఆన్సర్ ఇచ్చే యత్నం చేసారని చెప్పొచ్చు. తన విజన్, వర్క్ బాగుంది కానీ ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే తన వర్క్ మరీ అంత డిజప్పాయింట్ చెయ్యదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఈ మిగతా 9 ఎపిసోడ్స్ తో మొత్తం 18 రోజుల ‘కురుక్షేత్ర’ యుద్ధాన్ని ముగించిన విధానం డీసెంట్ గానే అనిపిస్తుంది. ఈ సీజన్ లో యాక్షన్, ఎమోషన్ పార్ట్ కంటే డ్రామా ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రై చేస్తే మంచిది. కేవలం యాక్షన్, విజువల్స్ మాత్రమే కోరుకునే వారు కాకుండా కురుక్షేత్రం కోసం ఆ మహాసంగ్రామంలోని చూడని తెలియని పరిస్థితులు ఇలానే ఉంటాయా? అనుకునే ఉత్సుకత ఉన్నవారికి అయితే బాగానే అనిపిస్తుంది కానీ మిగతా వారికి మాత్రం ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


