కాంతార చాప్టర్ 1 మరో ఫీట్.. అక్కడ సాలిడ్ రన్..!

కాంతార చాప్టర్ 1 మరో ఫీట్.. అక్కడ సాలిడ్ రన్..!

Published on Oct 20, 2025 9:01 PM IST

Kantara-Chapter-1

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయి మూడు వారాలు అవుతున్నా, పాన్ ఇండియా స్థాయిలో రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్‌తో దుమ్ములేపుతున్న ఈ చిత్రం, తాజాగా నార్త్ బెల్ట్‌లో కూడా తన సత్తా చాటుతోంది.

హిందీలో ఈ చిత్రం ఏకంగా రూ.175 కోట్ల మార్క్‌ను దాటి అదిరిపోయే రికార్డును సొంతం చేసుకుంది. కన్నడలో రూపొందిన చిత్రం బాలీవుడ్‌లో ఈ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకోవడం నిజంగా విశేషం. ఇక ఈ సినిమాకు ఈ వారం నుంచి హిందీ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదురవుతుంది.

రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్స్‌లో నటించిన ‘థామా’తో పాటు ‘ఏక్ దీవానే కి దీవానియత్’ చిత్రాలు ఈ వారం రిలీజ్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్‌లో కాంతార చాప్టర్ 1 డ్రీమ్ రన్‌కు బ్రేకులు పడే అవకాశం ఉందని బి-టౌన్ ఎక్స్‌పర్ట్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు