‘పెద్ది’ ఆన్ టైం.. గ్యారెంటీ ఇచ్చారుగా

‘పెద్ది’ ఆన్ టైం.. గ్యారెంటీ ఇచ్చారుగా

Published on Oct 15, 2025 4:57 PM IST

Peddi Ram Charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మెగా అభిమానులు ఆసక్తిగా మంచి అంచనాలు ఈ సినిమా పట్ల పెట్టుకోగా ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా జరుపుతున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ ని మేకర్స్ వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజుకు ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని మైత్రి మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. ఈ చిత్రం ఆన్ టైం ఉంటుంది అని కన్ఫర్మ్ చేసేసారు. సో పెద్ది రిలీజ్ విషయంలో అభిమానులకి ఎలాంటి డౌట్ అక్కర్లేదు అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రితో పాటు వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు