‘కురుక్షేత్ర’ మిగతా ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

‘కురుక్షేత్ర’ మిగతా ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

Published on Oct 12, 2025 12:30 AM IST

Kurukshetra Netflix Series

రీసెంట్ గా ఇండియన్ సినిమా దగ్గర దుమ్ము లేపిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ తర్వాత చాలానే సినిమాలు అనౌన్స్ అయ్యాయి. ఇక వాటి తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి రిలీజ్ కి సిద్ధం అయ్యిన యానిమేషన్ సిరీస్ నే “కురుక్షేత్ర”. పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ భాషల్లో కూడా తీసుకొచ్చిన ఈ సిరీస్ ని మేకర్స్ తీసుకొచ్చాక దీనికి సాలిడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.

మొత్తం 18 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసిన ఈ సిరీస్ లో మొదట 9 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ కి వచ్చాయి. కానీ మిగతా ఎపిసోడ్స్ ఎప్పుడు నుంచి వస్తాయి అనేది కూడా రివీల్ చేశారు. దీనితో మిగతా 9 ఎపిసోడ్స్ ని ఈ అక్టోబర్ 24 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ లో కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఈ 9 ఎపిసోడ్స్ కే మంచి రెస్పాన్స్ చూసిన వారి నుంచి వస్తుంది. ఇంకొన్ని రోజుల్లో మిగతా ఎపిసోడ్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తాయో చూడాలి.

తాజా వార్తలు