టైం లాక్ చేసుకున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టీజర్..!

టైం లాక్ చేసుకున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టీజర్..!

Published on Oct 11, 2025 12:14 PM IST

Andhra-King-Taluka

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఆంధ్ర కింగ్ తాలూకా”. ప్రతీ ఫ్యాన్ బయోపిక్ అంటూ ప్రమోట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇది వరకు వచ్చిన గ్లింప్స్, పాటలు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక ఫైనల్ గా చిత్ర యూనిట్ సినిమా టీజర్ రిలీజ్ కి రంగం సిద్ధం చేశారు.

ఇలా నిన్న దాని తాలూకా డేట్ ఇస్తే ఇప్పుడు మేకర్స్ టైం ని లాక్ చేసేసారు. దీంతో ఈ టీజర్ రేపు అక్టోబర్ 12 ఉదయం 11 గంటల 7 నిమిషాలకి వదులుతున్నట్టుగా ఖరారు చేశారు. మరి ఈ అవైటెడ్ టీజర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ నవంబర్ 28న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు