సమీక్ష : మటన్ సూప్ – కొంతమేర మెప్పించే థ్రిల్లర్

సమీక్ష : మటన్ సూప్ – కొంతమేర మెప్పించే థ్రిల్లర్

Published on Oct 11, 2025 2:55 PM IST

విడుదల తేదీ : అక్టోబర్ 10, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే తదితరులు
రచన-దర్శకత్వం : రామచంద్ర వట్టికూటి
నిర్మాతలు : మల్లిఖార్జున ఎలికా(గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
సినిమాటోగ్రఫీ : భరద్వాజ్, ఫణీంద్ర
సంగీతం : వెంకీ వీణ
ఎడిటర్ : లోకేష్ కడలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రతి శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఓ కొత్త బొమ్మ పడుతుంది. అలాగే, ఈ శుక్రవారం కూడా పలు తెలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో ‘మటన్ సూప్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కూడా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

శ్రీరామ్(రమణ్) ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ డబ్బు వసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తాడు. అందువల్ల అతనికి చాలా మంది శత్రువులు గా మారుతారు. ఆన్‌లైన్ ద్వారా పరిచయమైన సత్యభామ(వర్ష విశ్వనాథ్)ను ప్రేమిస్తాడు. ఓ రోజు అనుకోని ఘటనతో వారి పెళ్లి జరుగుతుంది. అతని పెళ్లిని ఇంట్లోవారు ఒప్పుకోరు. దీంతో అతడు వేరు కాపురం పెడతాడు. ఓ ఘటనలో అతనిపై దాడి జరుగుతుంది. అక్కడ తప్పించుకున్న శ్రీరామ్ ఇంట్లో యాసిడ్ దాడికి గురవుతాడు. ఇక ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు వచ్చిన ఎస్ఐ శివరాం(జెమినీ సురేష్) కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఇంతకీ శ్రీరామ్ పై ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తి ఎవరు..? సత్య ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి..? శ్రీరామ్ వల్ల బాధపడిన వారు ఎవరు..? ఈ కథలో అసలు స్కెచ్ వేసింది ఎవరు..? అనేది తెలియాలంటే ఈ సినిమాను థియేటర్ లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు మలిచిన తీరు బాగుంది. రామచంద్ర వట్టికూటి దర్శకత్వం, సన్నివేశాలను నడిపిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాప్‌లో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి మెచ్చుకోవాలి.

సెకండ్ హాఫ్‌లో సస్పెన్స్ బాగా పండింది. జెమినీ సురేష్ పోలీస్ పాత్రలో పక్కాగా నటించాడు. ఇలాంటి లో బడ్జెట్‌తోనూ సినిమా తీసి అందులో ప్రేక్షకులను కొంతవరకైనా ఎంగేజ్ చేయొచ్చనే దర్శకుడి కృషి స్పష్టంగా కనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాను స్టార్ట్ చేసిన తీరు బాలేదు. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. రమణ్ నటన పర్వాలేదనిపించినా, మరింత ఇంప్రూవ్ కావాల్సి ఉంది అనిపిస్తుంది. అటు హీరోయిన్ వర్ష విశ్వనాథ్ నటనలో సహజత్వం లోపించింది.

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ ఎడిటింగ్ వర్క్. ఎడిటింగ్ ఇంకా కచ్చితంగా చేసి ఉంటే సినిమాకు బలం చేకూరేది. మెయిన్ లీడ్‌తో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.

ఇక ఈ సినిమాకు కేటాయించిన బడ్జెట్ పరిమితులు సినిమాకి రిచ్ లుక్‌ రానీయలేదు. ఒకవేళ దర్శకుడికి మరింత బడ్జెట్ లభించి ఉండి ఉంటే, ఆయన సినిమాను ఇంకా మెరుగైన నిర్మాణ విలువలతో, ఆకర్షణీయమైన విజువల్ ప్రెజెంటేషన్‌తో తెరకెక్కించే అవకాశం ఉండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రామచంద్ర వట్టికూటి తనకు ఇచ్చిన బడ్జెట్‌తో ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. ఇలాంటి సస్పెన్స్ కథను బడ్జెట్ కాస్త పెరిగి ఉంటే ఆయన ఇంకా బెటర్‌గా ప్రెజెంట్ చేసేవారు. భరద్వాజ్, ఫణీంద్ర కెమెరా వర్క్ పర్వాలేదనిపించింది. చాలా సీన్స్ ఇంకా బెటర్‌గా కనిపించాల్సింది. వెంకీ వేణు సంగీతం సినిమాకు బలాన్ని అందించింది. బీజీఎం వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘మటన్ సూప్’ తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా కొంతవరకు పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్‌గా రాసుకుని ఉంటే, ఈ సినిమాకు బలాన్ని చేకూర్చేది. అయితే, సెకండ్ హాఫ్ ల్యాగ్ సీన్స్ ఉన్నా, సస్పెన్స్ రివీల్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు