బావమరిది పెళ్ళి.. హైలైట్ ఏమో తారక్ లుక్స్

బావమరిది పెళ్ళి.. హైలైట్ ఏమో తారక్ లుక్స్

Published on Oct 11, 2025 4:02 PM IST

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ చిత్రం వార్ 2 ఓటిటిలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం పక్కన పెడితే తారక్ లేటెస్ట్ గా తమ ఇంటి శుభకార్యంలో పాల్గొనడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ వివాహ వేడుకలో తారక్ కుటుంబ సమేతంగా కనిపించడం జరిగింది. అయితే తన బావమరిది పెళ్లిలో అందరి దృష్టి మాత్రం తారక్ పైనే పడింది.

మెయిన్ గా తారక్ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొన్నామధ్య కాంతార ఈవెంట్ లోనే తారక్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ గా ఆ మాస్ లుక్ కలిపి చూసేసరికి వారి ఆనందాలకు అవధులు లేవు. దీనితో నార్నె నితిన్ పెళ్ళిలో వారితో పాటుగా తారక్ హైలైట్ గా నిలిచాడు అని చెప్పాలి. ఇక ఈ లుక్స్ అంతా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేస్తున్న సినిమాకే అని తెలిసిందే.

తాజా వార్తలు