పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం ఓజి కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే రికార్డ్ గ్రాసర్ గా అయితే నిలిచింది. ఇక యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా మరో మార్క్ ని టచ్ చేసింది.
దీనితో ఓజి నార్త్ అమెరికాలో 5.5 మిలియన్ డాలర్లు గ్రాస్ ని క్రాస్ చేసి దాదాపు ఫైనల్ రన్ దగ్గరకి వెళ్తుంది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు అలాగే డీవివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.