300 కోట్లతో హిస్టారికల్ “ఓజి”.. టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులు!

300 కోట్లతో హిస్టారికల్ “ఓజి”.. టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులు!

Published on Oct 5, 2025 11:07 PM IST

AnilRavipudi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “ఓజి”. మన తెలుగు సినిమా నుంచి ఎలాంటి ఓపెనింగ్స్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్క సరైన సినిమా పడితే పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించిన సినిమా ఇది.

ఇలా 150 కోట్లకి పైగా ఓపెనింగ్స్ తో మొదలైన మోత ఇపుడు టాలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి దుమ్ము లేపింది. దీనితో ఓజి చిత్రం భారీ గ్రాసర్ గా ఇప్పుడు నిలిచింది అని చెప్పాలి. ఈ ఏడాదిలో తెలుగు నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా 303 కోట్లకి పైగా గ్రాస్ తో వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది.

మరి దానిని క్రాస్ చేసి ఓజి సరికొత్త గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది అని మేకర్స్ నుంచి వచ్చిన అప్డేట్ తో కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఇప్పుడు తగ్గిన టికెట్ ధరలు కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. మరి ఇదేమన్నా వర్కువుట్ అయితే ఓజి కి మంచి లాంగ్ రన్ పడుతుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు