టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రిషబ్ దర్శకత్వంలోనే తెరకెక్కించిన క్రేజీ డివోషనల్ యాక్షన్ డ్రామా “కాంతారా 1” కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ నడుమ వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రికార్డు వసూళ్లు అందుకుంటుంది. ఇలా మొత్తం మూడు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ మూడు రోజుల్లో భారీ నంబర్స్ సెట్ చేసినట్టు సినీ వర్గాల్లో బయటకి వచ్చింది.
మరి దీనితో కాంతార చాప్టర్ 1 ఈ మూడు రోజుల్లోనే ఏకంగా 235 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్టుగా ఇపుడు అనౌన్స్ చేశారు. ఇక ఈ నాలుగో రోజు ఆదివారం మరో 50 కోట్లకి పైగానే వసూళ్లు ఈ చిత్రానికి వచ్చే ఛాన్స్ గట్టిగా ఉన్నాయి. సో ఈ నాలుగు రోజుల్లోనే కాంతార 1 మొత్తం 300 కోట్ల క్లబ్ లో చేరిపోయినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో జైరాం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.