మొత్తానికి ‘ఓజి’ పై ఈ క్లారిటీ.. కానీ

మొత్తానికి ‘ఓజి’ పై ఈ క్లారిటీ.. కానీ

Published on Sep 23, 2025 7:02 AM IST

og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ఓజి’. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది. కానీ ఈ సినిమాకి మాత్రం ఆ హైప్ కి తగ్గ పాన్ ఇండియా రిలీజ్ అయితే లేనట్టే అని అనుకోవాలి. మొదటి నుంచీ ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ కి భారీ హైప్ ఇప్పుడు ఉంది.

అందులో భాగంగానే తెలుగు సహా హిందీ, తమిళ్ రిలీజ్ లు కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు రిలీజ్ కి వస్తున్నప్పటికీ ట్రైలర్ అప్డేట్స్, పోస్టర్స్ లో కూడా ఎక్కడా తెలుగు, తమిళ్, హిందీ అని కూడా మెన్షన్ చేయడం లేదు. దీనితో ఓజి తెలుగు ఒక్క భాషలోనే అని అభిమానులు అనుకున్నారు కానీ ఫైనల్ గా హిందీ ట్రైలర్ ఇపుడు రిలీజ్ చేయడంతో ఈ భాష రిలీజ్ ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయ్యింది. ఇక మిగతా వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు