తమిళ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఇడ్లీ కడాయి ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఈ అంచనాలు పెంచాయి. అయితే, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.
‘ఇడ్లీ కాడాయి’ చిత్రాన్ని తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అనే టైటిల్‌తో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ అందరూ చూసే విధంగా ఉండటం.. ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా అరుణ్ విజయ్, సత్యరాజ్, షాలినీ పాండే, రాజ్‌కిరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.