వంద కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టిన ‘మదరాసి’

వంద కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టిన ‘మదరాసి’

Published on Sep 18, 2025 9:00 PM IST

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ జంటగా నటించిన లేటెస్ట్ తమిళ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’ ఇటీవల రిలీజ్ అయింది. ఈ సినిమాకు తమిళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం కేవలం 13 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటిందని మేకర్స్ ప్రకటించారు. తమిళనాడులో సినిమాకు మంచి స్పందన లభించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మిక్సిడ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక త్వరగానే థియేటర్ల నుండి మాయమైంది.

ఈ సినిమాలో విద్యుత్ జామ్వాల్ విలన్‌గా కనిపించగా, బిజు మెనన్, విక్రాంత్, షబీర్ కల్లారక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు