రూరల్ పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందిన ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ టీజర్ లాంచ్

రూరల్ పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందిన ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ టీజర్ లాంచ్

Published on Sep 16, 2025 7:31 AM IST

ఎస్‌విఎస్ ప్రొడక్షన్స్ శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది రచన, దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీలో నాగిరెడ్డి ఎడిటింగ్ చేస్తూ సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బిజేపి బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి తదితరులు కీలకపాత్రల పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ తాజాగా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ప్రతి పాత్రలోనూ మానవ స్వభావాలు ప్రతిబింబిస్తాయి. అందుకే ‘జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ’ అనే ట్యాగ్ ఇచ్చాం. నటీనటులందరూ పోటీ పడి అద్భుతంగా నటించారు. నిర్మాతలకు ధన్యవాదాలు’ అన్నారు.

నిర్మాత దైవ నరేష్ గౌడ ‘ఈ సినిమా కొంతమంది రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుంది. మా బ్యానర్‌లో మరో 3 సినిమాలు రాబోతున్నాయి’ అన్నారు.

నిర్మాత స్రవంతి మల్లిక్ ‘నరసింహ నంది గారు ఎంతో ధైర్యంగా నిజ సంఘటనలపై ఈ సినిమాను తీశారు. ప్రతి పాత్ర హీరోగానే నిలుస్తుంది. ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తప్పవు” అన్నారు.

సంగీత దర్శకుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “సినిమాలో ట్విస్టులు, హై సీన్స్ చాలా ఉన్నాయి. మానవత్వం నుంచి రాజకీయాల వరకు విభిన్న కోణాలు ఉంటాయి” అన్నారు.

నటుడు విక్రమ్ జిత్ మాట్లాడుటూ.. “ఈ సినిమా ద్వారా స్త్రీ శక్తి ఎంత బలంగా ఉంటుంది అనేది మా డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు నేను ఎంతో ఎక్సైట్ గా ఫీల్ అయ్యాను. నాకు ఇచ్చిన పాత్రకు దర్శక నిర్మాతలకు థాంక్స్” అన్నారు.

నటి శ్రీలు మాట్లాడుతూ.. “ఇప్పటికి ఎన్నో సినిమాలు చేశాను కానీ ఈ సినిమా నా సినీ కెరియర్లో మంచి గుర్తింపు తీసుకొస్తుంది అని నమ్ముతున్నాను. ఈ సినిమాలో నా పాత్ర కాస్త కొత్తగా ఉండబోతుంది.” అన్నారు.

నటి మోహన సిద్ధి మాట్లాడుతూ.. “నా పాత్ర మొదట భయపెట్టింది కానీ చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్ కావడంతో అంగీకరించాను. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా రాబోతోంది” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు