ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా సాధారణ ప్రజల కోసం రూపొందిన అతిపెద్ద రియాలిటీ షో “ది లక్” రాబోతోంది. ఈ గేమ్‌లో సినీ, సెలెబ్రిటీలు ఉండరని.. ఇది పూర్తిగా సామాన్యులకు మాత్రమే వేదికగా ఉండబోతుందని దీని నిర్వాహకులు తెలిపారు.
తాజాగా ఈ రియాలిటీ షోకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన నిర్వాహకులు.. ఈ షోను ఒక ప్రముఖ సెలబ్రిటీ హోస్ట్ చేస్తారని తెలిపారు. దీంతో ఈ కామన్ మ్యాన్ రియాలిటీ షో ఎవరు హోస్ట్ చేస్తారా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ రియాలిటీ షో యూట్యూబ్ మరియు ఓటిటి ప్లాట్‌ఫాంలలో ప్రసారం కానుందని ప్రకటించారు.
ఇక ఈ గేమ్ షో కు సంబంధించిన ప్రత్యేకతలు ఇలా ఉండబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
– స్థైర్యం, వ్యూహం, ఓర్పు ఆధారంగా సవాళ్లు
– ప్రత్యేక ప్రతిభ అవసరం లేదు – కృషి, దృష్టి, అదృష్టం చాలు
– ప్రతి విజేతకు రూ.10 లక్షల బహుమతి
– ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు – పూర్తిగా ఉచితం
– సబ్స్క్రైబర్లలో నుంచి యాదృచ్ఛికంగా ఎంపిక
– పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ హామీ
‘ది లక్’ కీర్తి కోసం కాదు, పట్టుదలతో నిలబడి గెలవడానికి వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ గేమ్ షోలో పాల్గొనాలంటే www.theluck.world అనే వెబ్సైట్లో రిజిస్టర్ కావాలని నిర్వాహకులు సూచించారు.