రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్

రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్

Published on Sep 7, 2025 12:00 AM IST

Bellamkonda-Sreenivas

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘కిష్కింధపురి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేయగా పూర్తి హార్రర్ జోనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సందర్భంగా తాను కేవలం రీల్ హీరో మాత్రమే కాదని.. రియల్ హీరో అని నిరూపించుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని తాను అనారోగ్య కారణాల వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నానని పేర్కొనగా.. దీనికి బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించాడు. తాను చిత్ర ప్రమోషన్స్ కోసం విజయవాడ వస్తున్నానని.. అక్కడ ఆ అభిమానిని కలుసుకుని తనకు వీలైనంత సాయం అందిస్తానని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు.

దీంతో నెట్టింట బెల్లంకొండ శ్రీనివాస్‌ను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక కిష్కింధపురి చిత్రంలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజా వార్తలు