300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!

300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!

Published on Sep 4, 2025 1:59 PM IST

madharaasi

కోలీవుడ్ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రమే “మదరాసి”. శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో చేసిన ఈ యాక్షన్ చిత్రం మురుగదాస్ కి మంచి కంబ్యాక్ సినిమాగా నిలుస్తుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఈ సినిమా ఊహించని విధంగా ఇప్పుడు రిలీజ్ కి ఒక్క రోజే గ్యాప్ ఉన్నప్పటికీ పెద్దగా చప్పుడు లేకుండా ఉంది.

తెలుగులోనే అనుకుంటే తమిళ్ లో కూడా యావరేజ్ గానే ఉంది. ఈ సినిమాకి ముందు 300 కోట్లకి పైగా వసూళ్లు ఉన్న సినిమా శివకార్తికేయన్ కి ఉన్నప్పటికీ ఆ రేంజ్ హైప్ దీనికి కనిపించకపోవడం గమనార్హం. ఇక తెలుగులో అయితే అమరన్ కి వచ్చిన రేంజ్ ఓపెనింగ్స్ ని బీట్ చేయడం కూడా ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే సాధ్యం అయ్యేలా లేదు. సో ఈ సినిమాకి స్ట్రాంగ్ మౌత్ టాక్ పడితే తప్ప వర్కవుట్ అయ్యేలా లేదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా శ్రీ లక్ష్మి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు