మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!

మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!

Published on Aug 23, 2025 8:00 PM IST

X2 Movie

హను-మాన్ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తనదైన ముద్ర వేశాడు యంగ్ హీరో తేజ సజ్జా. ఆ సినిమాలో సూపర్ హీరో పాత్రలో నటించిన తేజ సజ్జా, ప్రస్తుతం ‘మిరాయ్’ అనే పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన యోధుడి పాత్రలో మెప్పించేందుకు సిద్ధవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. అయితే, నేడు(ఆగస్టు 23) తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. మరోసారి తేజ సజ్జాతో ఈ బ్యానర్ మరో పవర్‌ఫుల్ చిత్రాన్ని ప్రకటించింది. Teja Sajja X² PMF అనే ట్యాగ్‌తో ఈ చిత్రాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక ఈ సినిమా కథ రాయలసీమ నుంచి యావత్ ప్రపంచానికి చేరబోతుందని మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. చూస్తుంటే ఈ సినిమా కూడా ఓ సూపర్ హీరో చిత్రంలా కనిపిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు