ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన డివోషనల్ యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహా’ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. యానిమేషన్లో డివోషన్ను చూపెట్టిన తీరు ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఎవరి ఊహలకు అందని విధంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తుఫాను సృష్టిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి నాలుగు వారాలు దాటింది. ఐదవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా వసూళ్ల పరంగా ఏమాత్రం జోరు తగ్గడం లేదు. వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. దీంతో ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.278 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి తన సత్తా చాటింది.
ఇక ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద చిత్రాలు ఏమీ లేకపోవడంతో ‘మహావతార్ నరసింహా’ రూ.300 కోట్ల వసూళ్ల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒక యానిమేషన్ చిత్రం ఈ రేంజ్ కలెక్షన్స్‌తో దుమ్ములేపడంతో ఈ బ్యానర్ నుంచి రాబోయే తదుపరి మహావతార్ సిరీస్ చిత్రాలపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.