సమీక్ష: ‘బన్ బట్టర్ జామ్’ – యూత్ కి ఓకే అనిపించే రోమ్ కామ్ డ్రామా

సమీక్ష: ‘బన్ బట్టర్ జామ్’ – యూత్ కి ఓకే అనిపించే రోమ్ కామ్ డ్రామా

Published on Aug 22, 2025 9:47 PM IST

విడుదల తేదీ : ఆగస్టు 22, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రాజు జెయమోహన్, ఆద్య ప్రసాద్, భవ్య త్రిఖా, చార్లీ, శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని, మైఖేల్ తంగతురై, VJ పప్పు
దర్శకుడు : రాఘవ్ మిర్దాత్
నిర్మాతలు : రెయిన్ ఆఫ్ ఆరోస్, సురేష్ సుబ్రమణియన్
సంగీతం : నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రఫీ : బాబు కుమార్
ఎడిటింగ్ : జాన్ అబ్రహం

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ చిత్రం “బన్ బట్టర్ జామ్” కూడా ఒకటి. మరి రొమాంటిక్ కామెడీ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

చంద్రు అలియాస్ చంద్ర మోహన్ (రాజు జెయమోహన్) తన చిన్నప్పుడు నుంచి అమ్మ చాటు బిడ్డగా ఆడపిల్లలతో పెద్దగా పరిచయం లేకుండానే స్కూల్ లైఫ్ గడిపేస్తాడు. తన చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్ తంగదురై) అంటే కూడా తనకి ఎంతో ఇష్టం. ఇలా కాలేజీ లైఫ్ స్టార్ట్ అయ్యాక ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నందిని (భవ్య త్రిక) ని ప్రేమిస్తాడు. ఇద్దరూ బాగా లవ్ చేసుకుంటారు. కానీ ఇంకోపక్క చంద్రు తల్లి తన కొడుక్కి తాము సెట్ చేశామని తెలియకుండా తమంత తమే ప్రేమ పెళ్లి చేసుకునేలా మరో అమ్మాయి మధు (ఆథియా ప్రసాద్) తో కలపాలని ట్రై చేస్తారు. మరి ఈ మొత్తం గందరగోళంలో ఎవరు ఎవరిని ప్రేమించారు? తన ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ ఏం చేసాడు? చివరికి ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ మధ్య కాలంలో పలు రోమ్ కామ్ ఎంటర్టైనర్స్ వచ్చాయి కానీ ఇది యూత్ వరకు మాత్రం మంచి ఎంటర్టైనింగ్ గానే సాగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా యువతని అలరించే ఎలిమెంట్స్ వారికి భలే కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా కామెడి బాగా వర్కౌట్ అవుతుంది. యంగ్ నటుడు రాజు తన డెబ్యూ సినిమాలో చాలా బాగా చేసాడు.

తన లుక్స్ పరంగా కానీ నటన, యాక్షన్ లో బాగా కనిపించారు. చిన్న డైలాగ్స్ కామెడీ అయితే బాగా పేలింది. అక్కడక్కడా సందర్భానుసారంగా చెప్పే చిన్న చిన్న వన్ లైనర్స్ మంచి ఫన్ తెప్పిస్తాయి. ఇక వీటితో పాటుగా సినిమాలో లవ్ ట్రాక్స్ బాగున్నాయి. చంద్రు, నందిని నడుమ లవ్ ట్రాక్ ఇంకా వారి నడుమ రొమాంటిక్ మూమెంట్స్ బాగున్నాయి.

వాటికి అనుగుణంగా సాంగ్ కూడా మంచి ప్లస్ అయ్యాయి అని చెప్పవచ్చు. ఇక ఇవే కాకుండా సినిమాలో ఫ్రెండ్షిప్ ఎలిమెంట్ కూడా డీసెంట్ గా ఉంది. హీరోకి తన ఫ్రెండ్ కి నడుమ తమ ఫ్రెండ్షిప్ ట్రాక్ కూడా డీసెంట్ గా మంచి ఎమోషన్స్ తో సాగింది. ఇక వీరితో పాటుగా ఆథియా ప్రసాద్ క్యూట్ లుక్స్ తో మంచి నటన కనబరిచింది. వీరితో పాటుగా సీనియర్ నటులు దేవదర్శిని, శరణ్యాలు బాగా చేశారు. సెకండాఫ్ లో నటుడు వీజె పప్పుపై ఓ కామెడీ ట్రాక్ భలే నవ్వు తెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మెప్పించే అంశాలు బాగానే ఉన్నప్పటికీ నొప్పించే అంశాలు కూడా లేకపోలేవు. సినిమా ఆరంభమే ఒకింత రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ లో మొదలవుతుంది. అక్కడ నుంచి సినిమాలో లీనం కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఇక సినిమాలో ఆకట్టుకోని మరిన్ని అంశాల్లో ఆ లవ్ ట్రాక్స్ లో దేనికీ సరైన ముగింపు ఉన్నట్టు కనిపించదు.

చాలా సింపుల్ కారణాలతో ఒకరి లవర్ ని ఇంకొకరు ఒకరికి కాబోయే వాళ్ళని ఇంకొకరికి పెళ్లి ఇలాంటివి అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోగా ఒకింత వెగటుగా కూడా అనిపించే అవకాశం ఉంది. అంతే కాకుండా యూత్ ఎలిమెంట్స్ వరకు ఓకే కానీ ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ మాత్రం సినిమాలో పరమ బోరింగ్ గా సాగుతాయి.

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సెకండాఫ్ లో ఒక్క కామెడీ ట్రాక్ తప్ప మిగతా సినిమాలో అంతా బోరింగ్ గానే అనిపిస్తాయి. అలాగే ఒక డీసెంట్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ లో ఆ ఫ్లో కొంచెం మిస్ అవుతుంది. చాలా వరకు మూమెంట్స్ రొటీన్ అండ్ రెగ్యులర్ సినిమాల్లో చూసేసిన సన్నివేశాల్లానే అనిపిస్తాయి. ఇంకా కొన్ని కొన్ని సన్నివేశాలు లాజిక్స్ లేకుండా వెళ్లిపోతూనే ఉంటాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ మాత్రం ఇంకా బెటర్ గా ప్లాన్ చేస్తే బాగుండు. ఏదో పాత సినిమా చూసినట్టు అనిపిస్తుంది. నివాస్ ప్రసన్న సంగీతం బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో పాటలు బాగున్నాయి. బాబు కుమార్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. జాన్ అబ్రహం ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు రాఘవ్ మిర్దాత్ విషయానికి వస్తే.. తన వర్క్ కొన్ని అంశాల వరకు పర్వాలేదు కానీ మిగతా అంశాల్లో మాత్రం ఇంకా కేర్ తీసుకోవాల్సింది. యూత్ ఎలిమెంట్స్ వరకు బాగానే నడిపించారు. మంచి లవ్ ట్రాక్స్ రాసుకున్నారు కానీ వాటికి ఇచ్చిన ముగింపులు మాత్రం అంత అర్ధవంతంగా లేవు. అలాగే ఫ్యామిలీ ఎపిసోడ్స్ కూడా చాలా రొటీన్ గా డిజైన్ చేసుకున్నారు. ఇలా కొంతవరకు తన వర్క్ ఓకే అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘బన్ బటర్ జామ్’ చిత్రం యూత్ వరకు ఓకే అనిపించే రోమ్ కామ్ డ్రామా అని చెప్పవచ్చు. ఇందులో లవ్ ట్రాక్స్ ఇంకా కామెడీ, ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్ కూడా అక్కడక్కడా ఆకట్టుకుంటాయి. కాకపోతే మిగతా మూమెంట్స్ మాత్రం సినిమాలో ఒకింత రొటీన్ అండ్ రెగ్యులర్ గా నడిచాయి. సో వీటితో ఈ చిత్రాన్ని యూత్ వరకు కొంతమేర ఎంజాయ్ చేయగలరు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు