బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?

బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?

Published on Jul 28, 2025 10:37 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సోషియో ఫాంటసీ చిత్రంగా రానున్న ‘విశ్వంభర’ షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటుండగా.. మరో డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగా157లో చిరు బిజీగా ఉన్నాడు. అయితే, ఈ సినిమాల తర్వాత కూడా తన స్ట్రాంగ్ లైనప్‌ను కంటిన్యూ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఆయనకు ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు బాబీతో చిరు తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ కాంబో రిపీట్ కావడంపై అధికారికంగా ప్రకటన రాకపోయినా, సినీ సర్కిల్స్ టాక్ ప్రకారం చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా బాబీతోనే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను సెప్టెంబర్ 2025లో ప్రారంభించేందుకు బాబీ రెడీ అవుతున్నాడట.

ఈ సినిమా కోసం కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకుంటున్నాడట. ఇక ఈసారి చిరు కోసం బాబీ ఎలాంటి కథను పట్టుకొస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు