రజినికాంత్ నటించబోయే తరువాత చిత్రం ‘కొచ్చడయాన్’. ఈ చిత్రం జనవరి 2 నుండి చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. రజినికాంత్ ‘రాణా’ సినిమాలో నటించాల్సి ఉండగా ఆయన అనారోగ్యం పాలవడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ప్రస్తుతానికి రాణా చిత్రాన్ని పక్కన పెట్టి నూతన చిత్రానికి శ్రీకారం చుట్టారు. కొచ్చడయాన్ చిత్రానికి రజినికాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం కోసం కే.ఎస్. రవి కుమార్ కథ అందించనున్నారు. రజినికాంత్ సరసన నటించడానికి అనుష్క మరియు అసిన్ లను సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. కొచ్చడయాన్ కి ఛాయాగ్రాహకుడిగా రాజీవ్ మీనన్ పని చేయబోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబందించిన భాద్యతలు కూడా ఈయనే చూసుకుంటాడని సమాచారం.
జనవరిలో ప్రారంభం కానున్న రజినీకాంత్ కొత్త చిత్రం
జనవరిలో ప్రారంభం కానున్న రజినీకాంత్ కొత్త చిత్రం
Published on Dec 22, 2011 1:24 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?