తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ కదిలి వచ్చింది. ఇక ఈ అవార్డులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునేందుకు హాజరయ్యాడు.
అయితే, ఈ వేడుకలో ఓ అపూర్వమైన ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ క్రమంలో ఆయన అవార్డు గ్రహీతలను పలకరిస్తున్న తరుణంలో నందమూరి బాలకృష్ణతో పాటు అల్లు అర్జున్ను రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి వారిని కౌగలించుకున్నారు. బన్నీతో ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన మూమెంట్ ఈ అవార్డులకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గతంలో కొన్ని వివాదాలు వైరల్ అయిన సందర్భంగా, ఇప్పుడు ఇలాంటి మూమెంట్‌తో ఆ వివాదాలకు బ్రేక్ పడినట్లు అయ్యింది.