హాలీవుడ్ చిత్రాల్లో ఫ్రాంచైజీ చిత్రాలకు ఇండియన్ ప్రేక్షకులు ఎప్పటినుంచో మంచి పట్టం కడుతున్నారు. ఇక ఈ బాటలోనే వచ్చిన సినిమాలకు ఇక్కడి ప్రేక్షకులు మంచి రిజల్ట్ కూడా అందించారు. తాజాగా హాలీవుడ్లో రిలీజ్ అయిన ఓ హార్రర్ చిత్రానికి కూడా ఇండియన్ ఆడియన్స్ సూపర్ రెస్పాన్స్ అందించారు.
‘ఫైనల్ డెస్టినేషన్ 6’ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఇండియన్ ప్రేక్షకుల్లో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ చిత్రాలపై మంచి ఆసక్తి ఉండటంతో ఈ 6వ భాగం మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు.
ఫలితంగా ఈ మూవీ ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.65 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ‘కంజ్యూరింగ్’ చిత్రం తర్వాత ఈ రేంజ్లో ఓ హార్రర్ చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కించుకోవడం ఈ సినిమాకే సాధ్యం అయ్యిందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.