ఎమ్౩ మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి మరియు నటి సురేఖ వాణీ కూతురు సుప్రీతా నాయుడు హీరో హీరోయిన్ గా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇది. అయితే ఈ చిత్రం “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” అనే టైటిల్ గ్లింప్స్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని మేము లిమిటెడ్ బడ్జెట్ తో ప్రారంభించాము. కానీ మా హీరో హీరోయిన్ కి ఉన్న పాపులారిటీ వల్ల మా చిత్రానికి క్రేజ్ పెరిగింది. అందరికి సుపరిచితం అయిన నటీనటులు రాశి గారు, వినోద్ కుమార్ గారు, సురేఖ వాణి గారు, రాజా రవీంద్ర గారు ఇలా చాలా మంది పాపులర్ నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించాము. షూటింగ్ అంతా పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. “చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి” అనే మంచి టైటిల్‌తో త్వరలో మీ ముందుకు వస్తాము” అని తెలిపారు.
హీరోయిన్ సుప్రీతా నాయుడు మాట్లాడుతూ.. “సినిమా స్టార్టింగ్ టైంలో నాకు భయం వేసింది కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. మా డైరెక్టర్‌కి థాంక్స్ మా హీరో అమరదీప్ కి థాంక్స్, షూటింగ్ టైంలో చాలా సపోర్ట్ చేశారు. మా నిర్మాత నన్ను తన ఇంటి అమ్మాయిలా చూసుకున్నారు. ఈరోజు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసాము. విజువల్స్ చాలా బాగున్నాయి” అని తెలిపారు.
హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ.. “టైటిల్ చాలా బాగుంది. నా మొదటి సినిమాకి ఇంత మంచి టైటిల్‌తో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జర్నీలో మహేంద్ర గారి లాంటి మంచి ప్రొడ్యూసర్ని నేను ఎక్కడ చూడలేదు. సినిమాని నమ్మితే ఎంత అయినా ఖర్చు పెడతారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు. చక్కగా ప్లాన్ చేసుకుని మంచి సినిమాతో రావాలని అనుకున్నాను. అందుకే ఇంత సమయం పట్టింది. “చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి” మంచి సినిమా. మంచి ప్లానింగ్ తో ఈ సినిమా చేసాము. బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.