ఈ తేదీన ఏపీ సీఎం చంద్రబాబుని కలవనున్న టాలీవుడ్ పెద్దలు..!

ఈ తేదీన ఏపీ సీఎం చంద్రబాబుని కలవనున్న టాలీవుడ్ పెద్దలు..!

Published on Jun 12, 2025 9:35 AM IST

ఇటీవల తెలుగు సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర పరిస్థితులే నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ టాలీవుడ్ లో మాత్రం ఆ నలుగురు మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటున్నారు కానీ అందుకు తగ్గట్టుగా సామరస్య తోడ్పాటు అందించడం లేదు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం షాకింగ్ గా మారింది.

టాలీవుడ్ పెద్దలు కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసింది లేదు అని అసహనం వ్యక్తం చేశారు. అయితే ఫైనల్ గా టాలీవుడ్ పెద్దలు మొత్తం ఈ ఆదివారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సాయంత్రం 4 గంటల సమయంలో భేటీ అయ్యి కీలక అంశాలు చర్చించనున్నట్టుగా ఇప్పుడు సమాచారం. అలాగే ఈ మీటింగ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ఉంటుందట. మరి ఎవరెవరు మీట్ అవుతారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు