మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పలు భారీ సినిమాలు ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సహకారంతో తెరకెక్కుతున్న చిత్రం ది ఇండియన్ హౌస్ కూడా ఒకటి. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఇప్పుడు ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ సినిమాలో సముద్ర నేపథ్యంలో భారీ సీక్వెన్స్ ఉండగా దీనికోసం ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ లాంటి సెటప్ ని శంషాబాద్ లో వేశారు. ఇది ఊహించని విధంగా పగిలిపోవడంతో ఆ ప్రాంతంలో మొత్తం వరదలా మారిపోయిందట. దీనితో అక్కడే ఉన్న అసిస్టెంట్ కెమెరా మ్యాన్ కి తీవ్ర గాయాలు అయ్యాయట.
తనకే కాకుండా ఇతర సిబ్బందికి కూడా చిన్నపాటి గాయాలు కాగా వెంటనే వారిని హాస్పిటల్ కి తరలించారట. మరి ఈ భారీ సినిమా షూటింగ్ లో ఇలాంటి ప్రమాదం జరగడం బాధకారమే అని చెప్పాలి. వారంతా త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.